Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐసీయూలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Gurugram Medanta Hospital Air Hostess Assaulted in ICU
Advertisement
  • ఆసుపత్రి ఐసీయూలో మహిళపై లైంగికదాడి
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి
  • నిందితుడు ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్న దీపక్ (25)గా గుర్తించిన పోలీసులు
Advertisement
గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిళ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఈ నెల 6వ తేదీన ఓ యువకుడు చికిత్స పొందుతున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐసీయూలో బెడ్‌పై చికిత్స పొందుతూ ఉండటం వల్ల ఆమె ఆ యువకుడిని ప్రతిఘటించలేకపోయింది.

ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, ఆసుపత్రిలో జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఐసీయూలో ఉన్న సమయంలో తనపై లైంగికదాడి జరిగిందని, తన అనారోగ్యం కారణంగా ఆ యువకుడిని ఆ సమయంలో అడ్డుకోలేకపోయానని బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో ఇద్దరు నర్సులు కూడా అక్కడ ఉన్నారని, కానీ ఈ ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె పేర్కొంది.

దీంతో ఈ నెల 14న సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, ఎనిమిది మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. సిట్ బృందం నిందితుడిని గుర్తించేందుకు ఆసుపత్రిలోని దాదాపు 800 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. అలాగే ఆసుపత్రి సిబ్బందిని విచారించింది. 

ఈ క్రమంలో ఆసుపత్రిలో గత ఐదు నెలలుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బీహార్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన దీపక్ (25) సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు నిందితుడు దీపక్‌ను అరెస్టు చేశారు. 
Advertisement
Advertisement
Deepak
Gurugram Medanta Hospital
ICU sexual assault
Air hostess assault
Hospital sexual assault
Gurugram crime
India crime news
Sexual assault arrest
Medanta Hospital scandal

More Telugu News